చిట్టత్తూరు అరుంధతివాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మాతమ్మ కొలుపు మరియు అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారి ఊరేగింపులో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ఆయనకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కోవి చంద్రయ్య నాయుడు, కృష్ణమూర్తి, అల్లయ్య, వరప్రసాద్, మణి, ఉదయ్ కిరణ్, వాసు, రఘు, బుచ్చిరెడ్డి, మహేష్ యాదవ్, వెంకటరమణ, మణి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.