శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి సోమవారం నాడు విశేష అభిషేకం జరిగింది. స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పూలమాలలతో అలంకరించి, అర్చకులు పుష్పాలతో అర్చన చేసి హారతి సమర్పించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.