ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. సుజాత, తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానం ఈఓ శ్రీ బి. కె. వెంకటేశులు, అధికారులు, వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఐఓ శ్రీ లోకేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సి. నాగభూషణం యాదవ్ కూడా పాల్గొన్నారు.