ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం. సుబ్బయ్య, 2019–2024లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రోజాను ఉద్దేశించి, 2024లో టీడీపీ–ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక, సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తు గ్యారెంటీ’ మరియు ‘సూపర్ సిక్స్’ పథకాలతో రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. 77 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పనిచేస్తూ, పెట్టుబడులు ఆకర్షిస్తున్న చంద్రబాబుపై అనవసర విమర్శలు తగదని, సీఎం, మంత్రి నారా లోకేష్‌పై అపార్థ వ్యాఖ్యలు సహించబోమని హెచ్చరించారు.