శ్రీకాళహస్తి ఏపీవో దినేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఐదెకరాల లోపు భూమి, నీటి వసతి కలిగిన రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి, జీడిమామిడి, బత్తాయి, లెమన్ జామ, సీతాఫలం, దానిమ్మ వంటి వివిధ రకాల మొక్కలను అందించనున్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఉద్యానవన కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.