సీఎం చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ: నియోజకవర్గ అభివృద్ధి, కేడర్ సంక్షేమంపై చర్చ

691చూసినవారు
సీఎం చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి భేటీ: నియోజకవర్గ అభివృద్ధి, కేడర్ సంక్షేమంపై చర్చ
అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఆలయ అభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాల పురోగతిపై సీఎం తో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమించిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవం, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కేడర్‌నే పార్టీకి బలం అని, వారి సేవలకు గుర్తింపు లభిస్తే పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, నియోజకవర్గ అభివృద్ధితో పాటు కేడర్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్