రేణిగుంటలో తెలుగు యువత ఆధ్వర్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 'అంబటి డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు కిరణ్, టీడీపీ యువ నాయకులు తేజ, చిన్నబాబు, ఇతర యువకులు పాల్గొన్నారు. ఈ సంఘటన తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జరిగింది.