లడ్డులో రసాయనాలు: వైసీపీపై జనసేన నేత తీవ్ర ఆరోపణలు

1139చూసినవారు
లడ్డులో రసాయనాలు: వైసీపీపై జనసేన నేత తీవ్ర ఆరోపణలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యి పేరుతో రసాయనాలతో కూడిన సింథటిక్ పదార్థాలను వినియోగించి భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ తీవ్రంగా మండిపడ్డారు. సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో ఆవుపాలు లేకుండా కృత్రిమ నెయ్యిని వినియోగించినట్లు తేలినప్పటికీ, వైసీపీ శ్రేణులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. కల్తీ నెయ్యి వాడలేదని ప్రమాణం చేసేందుకు వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరిన చక్రధర్, తిరుమల లడ్డు కల్తీ వాస్తవాన్ని అంగీకరించి, భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మం విషయంలో జనసేన మౌనం వహించదని, భక్తుల విశ్వాసాల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్