సీఎం చంద్రబాబుకు శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం

965చూసినవారు
సీఎం చంద్రబాబుకు శ్రీకాళహస్తి మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
శ్రీకాళహస్తీశ్వర స్వామి జ్ఞాన ప్రసూనాంబికా దేవి మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆహ్వానించారు. ఆలయ ఉత్సవాల నిర్వహణపై సీఎం తో చర్చించారు. మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్, ఈవో, బోర్డు సభ్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్