ముక్కంటి సన్నిధిలో సీఆర్డీఏ కమిషనర్

1166చూసినవారు
సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీ విజయ రామరాజు ఆదివారం తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి, స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి. కె. వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు, ఆలయ ఏఈఓ శ్రీ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సి. నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ వెంకటస్వామి, ఏపీఆర్‌ఓ శ్రీ రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్