శ్రీకాళహస్తికి చెందిన డా. గుమ్మడిపూడి దశరదాచారి విజయవాడలోని గొల్లపూడి బిసి భవనంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ & అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో, ఎస్వీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసిన దశరదాచారి, చదువుతో పాటు కుల వృత్తి అయిన కొయ్య బొమ్మల తయారీలోనూ నైపుణ్యం సాధించారు. వారి కుటుంబం నాలుగు జాతీయ అవార్డులను పొందింది.