శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో అమ్మవారికి తిరుచి వాహనంపై కొలువు తీర్చి, పూలమాలలతో అలంకరించి, చిక్కులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో ఆలయ ఆవరణంలో అమ్మవారిని ఊరేగించారు. ఈ విశేష అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.