శివయ్య సన్నిధిలో ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ కార్యదర్శి

2012చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ చి. శ్రీధర్, ఐ. ఏ. ఎస్. , శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానాన్నిసోమవారం సందర్శించి, స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు, వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ, ప్రోటోకాల్ ఏఐఓ, ఆలయ పర్యవేక్షకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్