శ్రీకాళహస్తి దర్గా లో ఘనంగా రొట్టెల పండుగ

1178చూసినవారు
శ్రీకాళహస్తి దర్గా లో ఘనంగా రొట్టెల పండుగ
శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ లోని జూమ్లేషా పీర్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, తమ కోరికలు నెరవేరిన ఆనందంలో పరస్పరం రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంతానం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం వంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ భక్తులు రొట్టెలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వరరావు, నంద రమేష్, నాగరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్