శ్రీకాళహస్తిలో నూతన హోమియోపతి ఆసుపత్రికి భూమి పూజ

755చూసినవారు
శ్రీకాళహస్తిలో నూతన హోమియోపతి ఆసుపత్రికి భూమి పూజ
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మించనున్న హోమియోపతి ఆసుపత్రికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి భూమి పూజ చేశారు. 694 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో నాలుగు గదులుంటాయి. హోమియోపతితో పాటు అల్లోపతి వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. బస్టాండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రహదారిని అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అన్నదాన కార్యక్రమాలు, పేషెంట్లకు అవసరమైన వస్తువుల కోసం షాపులు కూడా ఏర్పాటు చేస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి శ్రీకాళహస్తీశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించగా, సీఎం రూ.6 కోట్ల బడ్జెట్‌తో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్