కేవీబీపురం మండలం ఆదవరానికి చెందిన వినోద్ (31) మంగళవారం శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్లో మేస్త్రి పనులు చేస్తుండగా, ఐదో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. టిఫిన్ తినడానికి భార్య పిలిచినప్పుడు అతను దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.