సులూరుపేట నియోజకవర్గం, నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసపురం సోషల్ ఫారెస్ట్ భూముల్లో కొందరు వ్యక్తులు నీలగిరి తైలం చెట్లను అక్రమంగా నరికివేసి, టన్నుల కొద్దీ కలపను తరలిస్తున్నారు. ఈ అక్రమాన్ని రెవెన్యూ, ఫారెస్ట్, మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.