శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, దేవస్థానానికి అనుబంధంగా ఉన్న కైలాస సదన్, గంగా సదన్ వసతి గృహాలను సందర్శించి సమగ్రంగా పర్యవేక్షించారు. భక్తులకు అందుతున్న సేవలు, వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి, అధికారులకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కొప్పెర్ల నాగరాజుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.