కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ
జనసేన నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి, స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.