శ్రీకాళహస్తి మండలం రెడ్డిపల్లి గ్రామంలో స్థానిక
బీజేపీ నేతలు వెంకటేశ్, భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో 'మన ఊరు -మన జెండా' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా
బీజేపీ పనిచేస్తోందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు లోకేష్ యాదవ్, శీను, బుజ్జి కూడా పాల్గొన్నారు.