ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

496చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, వాటికి తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా పట్టణంలోని పీఆర్ గెస్ట్ హౌస్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను వ్యక్తిగతంగా పరిశీలించి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత సమస్యలపై అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులతో మాట్లాడి, అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పదవి అనేది ప్రజలకు సేవకుడిగా అండగా నిలవడానికి దక్కిన గొప్ప అవకాశం అని, ప్రజల సమస్యలకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్