ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ మీడియా హెడ్ శ్రీ పిడుగు హరి ప్రసాద్ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ఆయనకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పండితులు వారికి ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు.