ఏర్పేడు మండలం రాజుల కండ్రిగలో దోమల బెడద తీవ్రమైంది. పాఠశాల సమీపంలోని మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్త, నిల్వ ఉన్న నీటితో దోమలు విపరీతంగా పెరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దీనిపై గ్రామస్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ఫాగింగ్ చేయాలని, కాలువను శుభ్రం చేయాలని అధికారులను కోరుతున్నారు.