దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయాన్ని
రిలయన్స్ అధినేత ముఖేష్
అంబానీ కుమారుడు అనంత్
అంబానీ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంత్
అంబానీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం, ఎమ్మెల్యే ఆయనకు స్వామి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్, లోకేష్ రెడ్డి, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, తెలుగుదేశం నాయకుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.