భారత చైతన్య యువజన పార్టీ (BCYP) శ్రీకాళహస్తి మండల కమిటీని ఏర్పాటు చేసింది. కలవగుంట పంచాయతీ గుండ్లపల్లి గ్రామానికి చెందిన చింత మురగయ్య యాదవ్‌ను శ్రీకాళహస్తి మండల కన్వీనర్‌గా ఎంపిక చేశారు. ఈ నియామక పత్రాన్ని ఆ పార్టీ తిరుపతి జిల్లా కన్వీనర్ వంక రమణయ్య యాదవ్, రాష్ట్ర మహిళ కో కన్వీనర్ హిమబిందు చేతుల మీదుగా అందజేశారు.