మీడియా మీద దాడి చేసే ఊరుకోము ఎమ్మెల్యే బొజ్జల

564చూసినవారు
మీడియా మీద దాడి చేసే ఊరుకోము ఎమ్మెల్యే బొజ్జల
శ్రీకాళహస్తి పట్టణంలో పి ఆర్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఏబీఎన్ ఛానల్పై వైసీపీ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. హైదరాబాదులో ఏబీఎన్ ఛానల్పై వైసీపీ నాయకులు దాడులకు ప్రయత్నించడం సరికాదని, తాము తలుచుకుంటే సాక్షి కార్యాలయాలపై దాడి చేయలేమా? అని ప్రశ్నించారు. ఉన్నట్లు ఉన్నట్లుగా రాసేదే మీడియా అని, వారిపై దాడి చేయటాలు సరైనది కాదని, రాబోయే రోజుల్లో సాక్షి మీడియాపై దాడి చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్