శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశిని పురస్కరించుకుని శుక్రవారం ప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. అర్చకులు, వేద పండితులు స్వామివారితో పాటు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు వంటి పవిత్ర ద్రవ్యాలతో షోడశోపచార అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని బిల్వపత్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. లోకకళ్యాణార్థం జరిగిన ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.