క్షయ నిర్మూలనకు ప్రధాని పిలుపు: దాతల చేయూత కోరిన అధికారులు

1380చూసినవారు
క్షయ నిర్మూలనకు ప్రధాని పిలుపు: దాతల చేయూత కోరిన అధికారులు
దేశం నుండి క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా శనివారం స్థానిక రేణిగుంట సంతలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో "ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్" అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో టీబీ పరీక్షలు, మందులు ఉచితంగా లభిస్తాయని, రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. దాతలు ముందుకు వచ్చి రోగులను దత్తత తీసుకొని పోషకాహారం అందించాలని, వారిపై వివక్ష చూపకుండా అండగా నిలవాలని కోరారు.

సంబంధిత పోస్ట్