జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం: 8,388 మంది పిల్లలకు చుక్కల మందు

1705చూసినవారు
జూన్ 28న పల్స్ పోలియో కార్యక్రమం: 8,388 మంది పిల్లలకు చుక్కల మందు
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలంలో జూన్ 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైద్యాధికారిణి డాక్టర్ తేజస్విని, హెల్త్ సూపర్వైజర్ కామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు. 8,388 మంది పిల్లల కోసం 36 సాధారణ కేంద్రాలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టులలో 3 ట్రాన్సిట్ బూత్‌లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రాల్లో టీకాలు వేస్తారు. మిగిలిపోయిన వారికి జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తామని తెలిపారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలకు తప్పక రెండు చుక్కలు వేయించాలని కోరుతూ హెల్త్ అసిస్టెంట్ మునివెంకటప్ప, ఆశా కార్యకర్తలు రుక్మిణి, ఆశాలతలతో కలిసి మండలంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్