రైల్వే ఉద్యోగి K. రవి ఆత్మహత్య కేసులో నిందితురాలు ఉషారాణి (35)ని రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్, పోస్టుమార్టం నివేదిక, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఆమెను కరకంబాడి బస్టాండ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చట్ట ప్రకారం నిందితురాలిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.