శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో అనుబంధంగా ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జాతర ఉత్సవాలు బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారికి ముగ్గులు వేసి, అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకర్త మండలి తరపున దీప నైవేద్యం, హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.