శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం రాత్రి సదో మూర్తి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను పూలమాలలతో అలంకరించి, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం, ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు.