పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలి

659చూసినవారు
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలి
శ్రీకాళహస్తిలోని పుష్పిత్ స్టీల్ పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులు వేతనాల కోసం, ఆకలితో అలమటిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో వేతనాల మంజూరు, కరెంట్, మంచినీటి సరఫరా పునరుద్ధరణ, భోజన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినా, 24 గంటలు గడిచినా అమలు కాలేదని ఆయన తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం వలస కార్మికుల పట్ల నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తోందని పుల్లయ్య మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్