జాతీయ పల్స్ పోలియో కేంద్రాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు

754చూసినవారు
జాతీయ పల్స్ పోలియో కేంద్రాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు
శ్రీకాళహస్తి పట్టణంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పోలియో కేంద్రాలలో సేవలందించారు. భాస్కర్‌పేట మునిసిపల్ పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు వియ్యాంపల్లి అంగన్‌వాడీ కేంద్రం, హనుమాన్ జంక్షన్, సాలిపేట శ్రీరామ మందిరం, భాస్కర్‌పేట మునిసిపల్ పాఠశాలల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడానికి తల్లిదండ్రులకు సహాయం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం ఓపెన్ ట్రూప్ స్కౌట్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్