ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు

153చూసినవారు
ఎన్టీఆర్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో, కోభాక, కొత్త వీరాపురం, సీతరాంపేట, ఏర్పేడు పార్టీ ఆఫీస్, మేర్లపాక, మన్నసముద్రం గ్రామాలలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు చేసి, కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి, ప్రజలకు పార్టీ కార్యక్రమాల గురించి వివరించారు. ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు, సీనియర్ నాయకులు పేరం ధనంజయులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్