శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

1138చూసినవారు
రేణిగుంట–తిరుపతి ప్రధాన రహదారిలోని రేణిగుంట ఫ్లైఓవర్‌పై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట పట్టణం నుంచి తిరుపతి వైపు వేగంగా బైక్ నడుపుతున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన యువకుడిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్