దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో సోమవారం సాయంత్రం పౌర్ణమి ఊంజల సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపం వద్ద సోమ స్కంద మూర్తి, జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి, ఆలయ ఊరేగింపుగా కోట మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువుదీర్చి, వేద పండితులు వేదమంత్రాల మధ్య హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టేసై ప్రసాద్, ఈవో వెంకటేశ్వర్లు, పాలకమండలి సభ్యులు కోలా విశాలని, శైలజ, గుర్రపు శెట్టి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.