పెత్తందారులపై చర్యలు తీసుకోండి

650చూసినవారు
పెత్తందారులపై చర్యలు తీసుకోండి
తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో గిరిజనుల భూములను ఆక్రమించి, వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్న పెత్తందార్లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు అంగేరి పుల్లయ్య డిమాండ్ చేశారు. స్థానిక శ్రీకాళహస్తి ఆర్డిఓ కార్యాలయం వద్ద పూడి గిరిజనులకు సంఘీభావంగా కేవీపీఎస్, ఏపీ గిరిజన సంఘం, ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రతిఘటన- రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ కొన్ని అగ్రకులాల పెత్తనం వల్ల సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్