తొట్టంబేడు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 'సహకారం ద్వారా సమృద్ధి' నినాదంతో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా సహకార శాఖ ఆదేశాల మేరకు సంఘ కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సంఘ అధ్యక్షులు బీమాల భాస్కర్ ముదిరాజ్, సహకార శాఖ అధికారి, సంఘ సీఈవో పి. చిరంజీవిరెడ్డి,
తెదేపా మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు బాలసుబ్రమణ్యం సంయుక్తంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉద్యోగులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.