శ్రీకాళహస్తిలో పట్టణ
టీడీపీ అధ్యక్షుడు జి. విజయకుమార్, ప్రధాన కార్యదర్శి కాసరం రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన
టీడీపీ నాయకుల సమావేశంలో, ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి చర్యలు చేపడుతున్న సమయంలో
వైసీపీ నేతల తీరును ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి అంశాన్ని ఉపయోగించుకోవద్దని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని
వైసీపీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దసరాదాచారి, ఉమేష్ రావు, రవి, బాలాజీ పాల్గొన్నారు.