ముక్కంటి సన్నిధిలో తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్

728చూసినవారు
ముక్కంటి సన్నిధిలో తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంతరావు, ఐఏఎస్, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి, రాహు-కేతు సర్పదోష నివారణ పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ బి. కె. వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు శ్రీ సి. నాగభూషణం యాదవ్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ వెంకటస్వామి, ఏపీఆర్‌ఓ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్