శనివారం ఉదయం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామ సమీపంలో నెల్లూరు నుంచి అరక్కోణం వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.