శ్రీకాళహస్తి (మండలం) బొక్కసంపాలెంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయం, శ్రీ కోదండ రామేశ్వర స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశులు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపి, నూతనంగా ఏర్పాటు చేసిన ప్రదోష ఉత్సవమూర్తులు, నంది వాహనాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.