శనివారం శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి సమీపంలోని ఫ్లైఓవర్‌పై అరటి కాయలతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.