తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ అధ్యక్షతన సులూరుపేట నియోజకవర్గ నాయుడుపేటలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) జిల్లా స్థాయి కార్యశాలలో, ఓటరు జాబితా సవరణలో పారదర్శకతను పెంచడం, క్షేత్రస్థాయిలో BLOలు, BLAలతో సమన్వయం చేసుకుంటూ తప్పులు లేని జాబితాను రూపొందించడంపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను బీజేపీ కార్యకర్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.