పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ

300చూసినవారు
పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ
సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో పన్ను బకాయిలపై ప్రభుత్వం 50% వడ్డీ రాయితీని ప్రకటించింది. మార్చి 31 లోపు పాత బకాయిలతో పాటు ప్రస్తుత పన్నులు చెల్లించిన వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఆదివారం కూడా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మున్సిపల్, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది సేవలు అందించనున్నారు. జరిమానాలు తప్పించుకోవాలంటే గడువులోపు పన్నులు చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ సదుపాయం తిరుపతి, సూళ్లూరుపేట ప్రాంతాల ప్రజలకు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్