ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ CVAP యూనిట్ ప్రారంభం

194చూసినవారు
ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ CVAP యూనిట్ ప్రారంభం
సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ CVAP యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా శాస్త్రీయ ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రజా సమస్యలకు డేటా ఆధారితంగా శాశ్వత పరిష్కారాలు అందించడమే ఈ యూనిట్ లక్ష్యమని, "స్వర్ణ సూళ్లూరుపేట విజన్ 2030" సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల్లో పారదర్శకత పెంచుతూ ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు అయ్యేలా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్