కలవకూరు ఇసుక అక్రమాలపై మాట్లాడిన వైసీపీ నేతలకు బెయిల్

352చూసినవారు
కలవకూరు ఇసుక అక్రమాలపై మాట్లాడిన వైసీపీ నేతలకు బెయిల్
నెల్లూరు జిల్లాలోని కలవకూరు ఇసుక రీచ్ అక్రమాలపై మాట్లాడిన వైసీపీ నేతలపై పెట్టిన కేసుల్లో అరెస్టయిన వారు బెయిల్ పై విడుదలయ్యారు. వారిని పొదలకూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ పూర్తి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తూ ప్రజలకు నిజాలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్