చంద్రబాబు చేతుల మీదుగా టిడ్కో ఇళ్ల ప్రారంభం, 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు

591చూసినవారు
చంద్రబాబు చేతుల మీదుగా టిడ్కో ఇళ్ల ప్రారంభం, 2.5 లక్షల మందికి గృహ ప్రవేశాలు
తిరుపతి జిల్లా, నాయుడుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్ల గృహ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధసారధి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2,50,893 మంది పేదలు గృహప్రవేశాలు చేసేలా కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ ఆపార్ట్‌మెంట్లకు ధీటుగా పార్కులు, వాకింగ్ ట్రాక్ వంటి మౌలిక సదుపాయాలతో టిడ్కో గృహ సముదాయాలను నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్