నాయుడుపేట బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభం

613చూసినవారు
నాయుడుపేట బస్టాండ్‌లో చలివేంద్రం ప్రారంభం
వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో, నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట డిపో మేనేజర్ డి. కళ ఈ సదుపాయాన్ని ప్రారంభించి ప్రయాణికులకు అంకితం చేశారు. ప్రతిరోజూ బస్టాండ్‌కు వచ్చే ప్రజలకు చల్లని తాగునీరు అందించడమే దీని లక్ష్యం. శాశ్వత ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు దాతలు ముందుకు వస్తే స్థలం కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్